విజయ్ తో నటించాలని ఆశపడుతున్న భామ


Rashmika mandanna wants Tamil star hero Vijay

విజయ్ దేవరకొండ తో నటించిన రష్మిక మందన్న తమిళ స్టార్ హీరో విజయ్ తో నటించాలని ఆశపడుతోంది . కన్నడ భామ అయిన రష్మిక మందన్న ఛలో చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయింది . ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం లో నటించింది . గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో మళ్ళీ విజయ్ దేవరకొండ తోనే డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది రష్మిక .

 

అయితే ఈ భామకు తమిళ స్టార్ హీరో విజయ్ తో నటించాలని ఆశగా ఉంది , అందుకే తమిళ దర్శక నిర్మాతలకు చెప్పండి నాకు ఛాన్స్ ఇవ్వమని అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది . అయితే విజయ్ సరసన రష్మిక కు నటించే ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చాయి కానీ అవన్నీ నిజం కాదని చెప్పింది రష్మిక . తమిళ సినిమాల్లో నటించాలని ఆశపడుతున్న ఈ భామకు ఛాన్స్ ఇస్తారా ?

English Title: Rashmika mandanna wants  Tamil star hero Vijay