సినిమా విడుదలకుముందే చాలా టెన్షన్ గా వుంది.. గ్లామరస్ హీరోయిన్ రష్మిక!!


Rashmika Mandanna's Latest News
Rashmika Mandanna’s Latest News

సినిమా విడుదలకుముందే చాలా టెన్షన్ గా వుంది.. గ్లామరస్ హీరోయిన్ రష్మిక!!

‘ఛలో’ సినిమా సూపర్  అవడంతో నిర్మాతలంతా హలో అంటూ  కథానాయిక రష్మిక వైపు పరుగులు తీస్తున్నారు.. తన రెండవ చిత్రం గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక రష్మిక వెనుదిరిగి చూడకుండా అవకాశాలు అందిపుచ్చుకుంటూ  టాలీవుడ్‌లోస్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపుతోంది.. ! అతి తక్కువ కాలంలోనే మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, నితిన్‌ వంటి స్టార్స్‌తో కలిసి రష్మిక  పనిచినటిస్తోంది.. ట్రెండీ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా భరత్‌ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ నిర్మించిన చిత్రం  ‘డియర్‌ కామ్రేడ్‌’.  ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా  రష్మిక చిత్ర విశేషాలను తెలిపారు.

నేనేంటో చేసి చూపిస్తాను!
‘తక్కువ కాలంలోనే అగ్ర కథానాయకులతో నటించే అవకాశం వచ్చింది. ఇది కచ్చితంగా నా ప్రతిభ వల్లే సాధ్యమైంది. నటించడం చాలా ఈజీ అనేది చాలా మంది నమ్మకం. కానీ మనది కాని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, నవ్వడం, ఏడ్వడం ఇవన్నీ ఎంత కష్టమో అనుభవిస్తే కానీ తెలియదు. ఫ్రేమ్‌లో కాస్త నవ్వాల్సి వచ్చినా, ఆ నవ్వు వెనుక ఉన్న భావాల్ని కచ్చితంగా ప్రేక్షకులకు చూపించగలగాలి. గ్లిజరిన్‌ పెట్టుకుని ఏడ్చే అలవాటు నాకు లేదు. ఆ సందర్భాన్ని మనసులోకి తీసుకుంటే తప్ప భావాన్ని పలికించలేం. ఇవన్నీ కష్టపడి చేసినవే. నాకు నటన రాదని చాలా మంది అన్నారు. అలాంటి మాటలు విని నేనేం కుంగిపోను. ‘నీకు రాదు.. చేతకాదు’ అని ఎవరైనా అన్నారంటే.. వాళ్లకు నేనేంటో చేసి చూపిస్తాను

అందుకే ‘నాకు తెలుగు రాదు..!

ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా. నా పాత్రకు మరొకరు డబ్బింగ్‌ చెబితే పూర్తి స్థాయిలో న్యాయం చేయలేరనిపించింది. అందుకే ‘నాకు తెలుగు రాదు.. కానీ డబ్బింగ్‌ చెప్పుకుంటా’ అని దర్శకుడ్ని అడిగా. నా డబ్బింగ్‌ పూర్తి చేయడానికి దాదాపు 60 రోజులు పట్టింది. బహుశా… ఇంత సుదీర్ఘంగా డబ్బింగ్‌ చెప్పిన కథానాయికని నేనేనేమో..?’.

తొలిసారి బ్యాటు పట్టుకున్నా!

‘‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో నేను రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా కనిపిస్తాను. తెరపై నేను క్రికెట్‌ ఆడేది కాసేపే. కానీ అందుకు సంబంధించిన సన్నివేశాల కోసం చాలా సాధన చేశాను. నా జీవితంలో నేను క్రికెట్‌ ఆడలేదు. బాస్కెట్‌ బాల్‌ మాత్రం వచ్చు. తొలిసారి బ్యాటు పట్టుకున్నా. క్రికెట్‌కి సంబంధించిన పదజాలం తెలుసుకునే ప్రయత్నం చేశా. ఈమధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు కూడా చూశాను. సెమీ ఫైనల్‌లో ధోనీ రనౌట్‌ అవ్వడం చాలా బాధ కలిగించింది. ఒక్కసారి గుండె ఆగిపోయినంత పనైంది. మనకే అలా ఉంటే, మైదానంలో, వేలాది మంది సమక్షంలో క్రికెట్‌ ఆడేవాళ్లకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి’.

నా కష్టానికి ప్రతిఫలం వస్తుందా? !

‘వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. చాలా ఒత్తిడిగా అనిపిస్తోంది. తిండి లేదు, నిద్ర లేదు. ఒక్కోసారి తెల్లవారుజామున సెట్‌కి వెళ్తే.. పడుకునే సరికీ తెల్లారిపోతోంది. మరుసటి రోజు మళ్లీ సెట్‌కి వెళ్లాల్సిందే. తిండి తినాలన్న విషయం కూడా మర్చిపోతుంటాను. ఓ రకంగా నేను కోరుకున్నదీ ఇదే, తీరిక లేకుండా పని చేయగలగడం నిజంగా ఓ వరం. సినిమా విడుదలకు ముందు చాలా టెన్షన్‌ పడుతున్నా. నా నటన ప్రేక్షకులకు నచ్చుతుందా?, నా కష్టానికి ప్రతిఫలం వస్తుందా?.. ఇలా ఎన్నో సందేహాలుంటాయి. అలాంటప్పుడు నిద్ర కూడా పట్టదు..అన్నారు!!