ర‌ష్మిక నాన్ స్టాప్ షూటింగ్ ఫ‌ర్ `పుష్ప‌`!

ర‌ష్మిక నాన్ స్టాప్ షూటింగ్ ఫ‌ర్ `పుష్ప‌`!
ర‌ష్మిక నాన్ స్టాప్ షూటింగ్ ఫ‌ర్ `పుష్ప‌`!

చిత్ర పరిశ్రమలో స్టార్‌డమ్. పాపులారిటీని అతి త‌క్కువ కాలంలోనే పొందాలంటే క‌ఠోరంగా శ్ర‌మించాల్సిందే. అంతే కాకుండా కృషితో పాటు ఎద‌గాలంటే అంకితభావం కూడా అవసరం. స్టార్ హీరోయిన్  రష్మిక‌ మందన్న ఇదే ప‌ని చేస్తోంది. అత్యంత అంకితభావంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అంద‌రినీ ఆశ్చ‌ర్య‌స‌రుస్తోంది. `ఛ‌లో`తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక అన‌తి కాలంలోనే స్టార్ హీరోల స‌ర‌స‌న బంప‌‌ర్ ఆఫ‌ర్‌ల‌ని ద‌క్కించుకుంటోంది.

ప్ర‌స్తుతం స్టార్ హీరో అల్లు అర్జున్ న‌టిస్తున్న `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తోంది. ఈ మూవీ కోసం ఒక రోజు మొత్తం చిత్రీకరణ‌లో పాల్గొని ర‌ష్మిక ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ట‌. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు ఇప్పటికే తెలిసింది. ప్రస్తుతం ర‌ష్మిక ఈ సినిమా షెడ్యూల్ లో పాల్గొంటోంది. కొద్దిసేపటి క్రితం ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ర‌ష్మిక ప‌క్కా ప‌ల్లెటూరి యువ‌తిగా క‌నిపించ‌బోతోంది. బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆగస్టు 13 న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు.