ల‌క్కంటే ర‌ష్మిక మంద‌న్న‌దే!

ల‌క్కంటే ర‌ష్మిక మంద‌న్న‌దే!
ల‌క్కంటే ర‌ష్మిక మంద‌న్న‌దే!

త‌న‌దైన చిలిపిద‌నంతో మ‌న ప‌క్కింటి అమ్మాయిగా ప్రేక్ష‌కహృద‌యాల్లో బ‌ల‌మైన ముద్ద‌ర వేసుకుంది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న‌. అన‌తి కాలంలోనే అత్యంత ఆర‌ద‌ణ సొంతం చేసుకుని టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. `ఛ‌లో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక వ‌రుస హిట్‌ల‌తో త‌న చ‌రిష్మాని చాటుకుంటోంది.

`ఛ‌లో` నుంచి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో చేసిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిల‌వ‌డంతో ఇండ‌స్ట్రీలో వున్న స్టార్ హీరోల దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటూ ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో బ‌న్నీ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పుష్ప‌`లో న‌టిస్తున్న ర‌ష్మిక త‌మిళంలో కార్తి హీరోగా రూపొందుతున్న `సుల్తాన్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా వుంటే సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా రూపొంద‌నున్న హిందీ చిత్రం `మిష‌న్ మ‌జ్ను` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టించే గోల్డెన్ ఆఫ‌ర్‌ని సొంతం చేసుకుంది. `సూప‌ర్ 30` ఫేమ్‌ వికాస్ బెహెల్ డైరెక్ట్ చేయ‌నున్న ఈ మూవీలో బిగ్‌బీకి డాట‌ర్‌గా ర‌ష్మిక క‌నిపించ‌నుంద‌ట‌. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలిసింది. ర‌ష్మిక లైన‌ప్ చూసిన వాళ్లంతా ల‌క్కంటే రష్మిక‌దే అంటున్నారు.