ఆ స్టార్ హీరో సరసన చేయాలని ఉందని అంటున్న రష్మిక


Rashmika Mandanna
ఆ స్టార్ హీరో సరసన చేయాలని ఉందని అంటున్న రష్మిక

కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న అనతికాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోనుంది. నితిన్ భీష్మతో పాటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికే మహేష్, అల్లు అర్జున్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవి కనుక హిట్ అయితే అమ్మడి రేంజ్ పూర్తిగా మారిపోతుంది అనడంలో సందేహం లేదు.

ఇక రష్మిక ఈ ఏడాది తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతోంది. రష్మిక కార్తీ సరసన నటించిన సుల్తాన్ ఈ ఏడాది చివర్లో విడుదలవుతుంది. ఇక తమిళ టాప్ హీరో విజయ్ 64వ చిత్రంలో కూడా హీరోయిన్ గా రష్మికనే అనుకుంటున్నారు. వీటితో పాటు కన్నడ సినిమాలు ఉండనే ఉన్నాయి.

ఇలా సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. ఇంతమంది స్టార్ హీరోలతో నటిస్తున్నా రష్మికకు మాత్రం ఒక స్టార్ హీరో సరసన నటించాలని ఉందట. అతను ఎవరో కాదు, తల అజిత్. తన సినిమాలో నటించడం తన డ్రీం అంటోంది అజిత్. దాందేముంది, ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు హిట్ అయితే ఆఫర్ వెతుక్కుంటూ వస్తుంది.