మాస్ రాజా కోసం ఆ ఇద్ద‌రు!Rasi khanna and Nidhi agarwal in Ravitejas film
Rasi khanna and Nidhi agarwal in Ravitejas film

మాస్ రాజా ర‌వితేజ స్పీడు పెంచారు. వ‌రుస ప్రాజెక్ట్‌లు అంగీక‌రిస్తూ షాకుల మీద షాకులిస్తున్నారు.  నేల‌టిక్కెట్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని, డిస్కోరాజా చిత్రాలు వ‌రుస‌గా ఫ్లాప్ కావ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్‌లు అంగీక‌రి‌స్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో `క్రాక్‌` ‌చిత్రంలో న‌టిస్తున్న ర‌వితేజ మ‌రో రెండు చిత్రాల్ని అంగీక‌రించారు.

త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న ర‌వితేజ ఈ చిత్రానికి ముందే ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `ఖిలాడీ` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిసింది. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మాస్ రాజా ర‌వితేజ‌కు జోడీగా ఇద్దురు క్రేజీ హీరోయిన్‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌.

రాశిఖ‌న్నా, నిధి అగ‌ర్వాల్‌ల‌ని హీరోయిన్‌లుగా ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లో మేక‌ర్స్ అధికారికంగా వెల్ల‌డించ‌నున్న‌ట్టు స‌మాచారం.