త‌మిళ భాష‌తో కుస్తీ ప‌డుతోంది!


త‌మిళ భాష‌పై కుస్తీ ప‌డుతోంది!
త‌మిళ భాష‌పై కుస్తీ ప‌డుతోంది!

వైర‌స్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ స‌మ‌యాన్ని చాలా మంది స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. కొంత మంది సిక్స్ ప్యాక్‌లు పెంచేస్తే మ‌రి కొంత మంది వ‌ర్క‌వుట్‌లు చేస్తున్నారు. కొంత మంది తెలియ‌ని భాష‌పై ప‌ట్టు సాధించ‌డానికి కుస్తీలు ప‌డుతున్నారు. రాశి ఖ‌న్నా  కూడా ఇదే ప‌నిచేస్తోంది.

ఇప్ప‌టికే తమిళంలో పాగా వేసిన రాశిఖన్నా తాజాగా సూర్య తో యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి తెర‌కెక్కించ‌నున్న చిత్రాన్ని అంగీక‌రించింది. లాక్‌డౌన్ కావ‌డంతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది. త్వ‌ర‌లో లాక్‌డౌన్ ముగియ‌నుండ‌టంతో అంతా షూటింగ్ ఏర్పాట్లులో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సోయ‌గం తెలుగు నేర్చుకుని కొన్ని చిత్రాల‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న విష‌యం తెలిసిందే.

త‌మిళంలోనూ సూర్య సినిమాకి తానే డ‌బ్బింగ్ చెప్పాల‌ని ఫిక్స‌యింద‌ట‌. ఇందులో భాగంగా త‌మిళ భాష‌పై ప‌ట్టు సాధించ‌డం కోసం కుస్తీ ప‌డుతోంది. ఈ సంద‌ర్భంగా రాశి పెట్టిన పోస్ట్ ఆక‌ట్టు కుంటోంది. `మ‌ళ్లీ స్కూల్‌కి వ‌చ్చిన‌ట్టుగా వుంది. త‌మిళ భాష నేర్చుకుంటున్నాను. ఇందుకు ఓ టీచ‌ర్‌ని కూడా అపాయింట్ చేసుకున్నాను. ఆమె పేరు లీలా. ప్ర‌స్తుతం క్లాస్ వ‌ర్క్ , హోమ్ వ‌ర్క్‌, క్లాస్ టెస్ట్‌ల‌తో బిజీగా వున్నాను` అని ట్వీట్ చేసింది.