కొంటె చూపుల్తో.. నాజూకు న‌డుముతో…


కొంటె చూపుల్తో.. నాజూకు న‌డుముతో...
కొంటె చూపుల్తో.. నాజూకు న‌డుముతో…

క్రేజ్ వుంటేనే రంగుల ప్ర‌పంచంలో నిల‌బ‌డ‌గ‌లం.. లేదంటే ఫేడ‌వుట్ అయిపోవాల్సిందే.. ఈ సూత్రాన్ని రాశిఖ‌న్నా బాగానే వంట‌బ‌ట్టించుకున్న‌ట్టుంది. తెలుగులో అవ‌కాశాలు గ్గ‌డంతో త‌మిళ ఇండ‌స్ట్రీని ఎట్రాక్ట్ చేయ‌డం మొద‌లుపెట్టింది. `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో గ‌త ఏడాది చివ‌ర్లో ఓ హిట్‌ని సొంతం చేసుకున్నా ఆ త‌రువాత వ‌చ్చిన `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` రాశీఖన్నాకు భారీ ఫ్లాప్‌ని అందించింది.

దీంతో రాశికి తెలుగులో మ‌రో ఆఫ‌ర్ ల‌భించ‌లేదు. దీంతో త‌న ఫోక‌స్‌ని త‌మిళ ఇండ‌స్ట్రీకి మార్చిన రాశి టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ మేక‌ర్స్‌ని ఆక‌ర్షించే ప‌నిలో ప‌డింది. ఇటీవ‌ల మోడ్ర‌న్ డ్రెస్‌లో బ‌ట‌న్ విప్పి మ‌రీ అందాల విందుకు సిద్ధ‌మై స‌ద‌రు ఫొటో షూట్ పిక్స్ వైర‌ల్ అయ్యేలా చేసింది. ఆ త‌రువాత లంగా ఓణీలో ద‌ర్శ‌నిమిచ్చి షాకిచ్చేసింది. బాపు బొమ్మ‌లా క‌నిపించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

తాజాగా మ‌రో బంచ్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో పంచుకుంది. చీర‌క‌ట్టులో అచ్చ‌తెలుగు ప‌ల్లె ప‌డుచులా క‌నిపిస్తూ నాజూకు న‌డుమందాల్ని చూపిస్తూ కొంటె చూపుల్తో క‌వ్విస్తోంది. రాశి తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం రాశి త‌మిళంలో రెండు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. సిద్దార్ధ్ హీరోగా న‌టిస్తున్న `సైతాన్ కా బచ్చా`, విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న `తుగ్ల‌క్ ద‌ర్బార్‌`లో న‌ట‌న‌కు ఆస్కార మున్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతోంది.

 

View this post on Instagram

 

Can’t take eyes off her 😍😍🤩 @raashikhannaoffl #raashikhanna #Raashi #shreyasmedia #shreyasgroup

A post shared by Shreyas Media (@shreyasgroup) on