సారీ చెప్పిన రాశి ఖన్నా


అందమైన ముద్దుగుమ్మ రాశి ఖన్నా సారీ చెప్పింది , అయితే ఆమె తప్పు ఇందులో ఎంత మాత్రం లేదు సుమా ! అయినప్పటికీ సారీ చెప్పకతప్పలేదు పాపం . అసలు విషయం ఏంటంటే తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని తమిళ్ లో అయోగ్య పేరుతో రీమేక్ చేసారు . ఆ చిత్రంలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటించిన విషయం తెలిసిందే .

అయితే రాశి ఖన్నా డబ్బింగ్ చెప్పుకోదు కాబట్టి తన పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎస్ ఆర్ రవీనా చేత డబ్బింగ్ చెప్పించారు . మే 11 న ఎన్నో అవాంతరాలను దాటుకొని విడుదలైన అయోగ్య చిత్రానికి తమిళనాట జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు . అయితే ఆ సినిమా టైటిల్స్ లో అందరి పేర్లు వేశారు కానీ డబ్బింగ్ ఇస్తున్న వాళ్ళ పేర్లు మాత్రం వేయడం లేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది రవీనా . ఆ ట్వీట్ చూసిన రాశి ఖన్నా రవీనా కు సారీ చెప్పడమే కాకుండా నీ అందమైన గొంతుని నాకు అరువు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు అంటూ తెలిపింది రాశి ఖన్నా .