ర‌ష్మిక జాక్‌పాట్ కొట్టిన‌ట్టేనా?


Rasmika mandanna ready to pair with Ntr
Rasmika mandanna ready to pair with Ntr

ఛ‌లో, గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్‌…ఇలా వ‌రుస క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్న ర‌ష్మిక తాజాగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో త‌న ఖాతాలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని వేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్, క‌ర్నూల్ ఏపిసోడ్‌ల‌తో ర‌ష్మిక  హీరో మ‌హేష్‌తో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఒక ద‌శ‌లో డాయినేట్ చేస్తోందా? అనేంత‌గా న‌టించింది.

ఇందులో ఆమె న‌ట‌న చూసిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ త‌న త‌దుప‌రి చిత్రంలో ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. అల్లు అర్జున్‌తో ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో మాంచిజోష్‌మీదున్న త్రివిక్ర‌మ్ వెంట‌నే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో నెక్స్ట్ సినిమాని మొద‌లుపెట్ట‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌.

జోడీ కొత్త‌గా వుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. ర‌ష్మిక కూడా ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది. దీంతో ఇద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా గ్యారెంటీ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్‌లో బిజీగా వున్నారు. అది పూర్తి కాగానే త్రివిక్ర‌మ్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించేస్తాక‌ని తాజా న్యూస్‌. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్‌ని త్వ‌ర‌లోనే చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించ‌నున్నాయ‌ట‌. అల్లు అర్జున్‌తో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రంతో ర‌ష్మిక న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.