ఇక హిందీలో కూడా క్రిస్టోఫర్ అరాచకంRatsasan movie remake in hindi
Ratsasan movie remake in hindi

క్రిస్టోఫర్ హిందీలో అంటే హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడని కాదు ; క్రిస్టోఫర్ అనే పాత్ర హిందీ ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. 2018 లో తమిళంలో వచ్చిన “రాత్ససన్” సినిమాలో మనల్ని 2 గంటలపాటు కనపడకుండా, సీట్ ఎడ్జ్ మీద కూర్చోపెట్టి, సినిమా చూసేలా చేసిన విలన్ క్రిస్టోఫర్. స్కూలు అమ్మాయిల మర్డర్ మిస్టరీలలో భాగంగా వేర్నియర్ సిండ్రోం అనే బౌతిక సమస్యతో పాటు; సీరియల్ కిల్లర్ గా మారిపోయిన విలన్ ఆ సినిమాకే హైలెట్. గతంలో ఒక మంచి కామెడీ సినిమా తీసిన దర్శకుడు రాం కుమార్ ఈ సబ్జెక్ట్ తీసుకుని వెళితే, ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఎలా డీల్ చేస్తాడో అని, ఎవారూ ముందుకు రాలేదు. చివరకి కథని నమ్ముకుని, మామూలు నటులతో, టెక్నీషియన్స్ తో ఆ సినిమాని ఒక ఇండస్ట్రీ హిట్ చేసాడు రాం కుమార్ . ముఖ్యంగా విలన్ క్రిస్టోఫర్ నటనతో పాటు, గిభ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు ఒక పెద్ద అసెట్.

ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో తెరపై చూపించబోతున్నారు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ, హీరోఇజం అనే ఇమేజ్ ని పట్టించుకోకుండా, వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న ఆయుష్మాన్ ఖురానా ఇందులో నటిస్తున్నాడు. ఈ ఏడాది బాలా, ఆర్టికల్ 15, డ్రీం గర్ల్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ లు సాధించిన ఆయుష్మాన్ ప్రస్తుతం శుభ్ మంగళ సావదాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే రాత్సాసన్ సినిమాకు సంబంధించి, హీరో కన్నా, విలన్ క్రిస్టోఫర్ పాత్ర ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.