మెగాఫోన్ ప‌ట్టేందుకు స్టార్ హీరో రెడీ!


Rav Teja ready to hadle mega phone
Rav Teja ready to hadle mega phone

డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యామ‌ని మ‌న హీరోల్లో చాలా మంది అప్పుడ‌ప్పుడు చెబుతుంటారు. అయితే డైరెక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన వాళ్లు కూడా ఇక్క‌డ చాలా మందే వున్నారండోయ్‌. నాని డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసి కాలం క‌లిసి రావ‌డంతో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ `అష్టాచ‌మ్మా` సినిమాతో హీరో అయ్యారు. ఈ నేచుర‌ల్ స్టార్ త‌ర‌హాలోనే డైరెక్ట‌ర్ కావాల్సిన మాస్ మ‌హారాజా ర‌వితేజ క్యారెక్ట‌ర్ అర్టిస్ట్ నుంచి `సిందూరం`తో యాక్ట‌ర్ గా మారిపోయారు.

మాస్ మ‌హారాజాగా పేరు తెచ్చుకున్న ఆయ‌న త్వ‌ర‌లో మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నార‌ట‌. అయితే అందులో మాత్రం తాను న‌టించ‌న‌ని, మ‌రో హీరోతోనే అది చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ర‌వితేజ ఏడాది విరామం త‌రువాత రెండు విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో ఒక‌టి `డిస్కోరాజా` మ‌రొక‌టి `క్రాక్‌`. మురుగ‌దాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ రూపొందిస్తున్న `డిస్కోరాజా` ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వి.ఐ. ఆనంద్ హీరో ర‌వితేజ‌తో పాటు బాబీ సింహాని ఇంట‌ర్వ్వూ చేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించిన ర‌వితేజ ప్రేక్ష‌కుల మైండ్ సెట్ మారింద‌ని, ఆ కార‌ణంగానే కొత్త త‌ర‌హా చిత్రాలు వ‌స్తున్నాయ‌ని. త‌ను కూడా త్వ‌ర‌లోనే మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.