సౌత్ సినిమాలోకి మరో బాలీవుడ్ తార


సౌత్ సినిమాలోకి మరో బాలీవుడ్ తార
సౌత్ సినిమాలోకి మరో బాలీవుడ్ తార

బాలీవుడ్ సినిమాల్లో సౌత్ స్టార్స్ నటించాలని పరితపించే స్థాయి నుండి ఇప్పుడు బాలీవుడ్ తారలే సౌత్ సినిమాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి రాజమౌళి, శంకర్, మణిరత్నం, మురుగదాస్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ప్రధాన కారకులు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, అలియా భట్ ను నటిస్తున్న విషయం తెల్సిందే. అజయ్ దేవగన్ ఇప్పటికే షూట్ లో పాల్గొంటుండగా, అలియా భట్ ఇంకా షూట్ లో జాయిన్ కావాల్సి ఉంది. ఇప్పుడు సౌత్ సినిమాలు ఎక్కువగా ప్యాన్ ఇండియా రిలీజ్ లపై దృష్టి పెడుతున్నాయి. అందుకే రీచ్ కోసం బాలీవుడ్ తారలను సంప్రదిస్తున్నాయి. ఆ నటులు కూడా సౌత్ లో తమకు గుర్తింపు వస్తుందని ఒప్పుకుంటున్నారు. ఇలా ప్యాన్ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ నటుల కోలాహలం ఎక్కువైంది.

గతేడాది అందరి దృష్టిని ఆకర్షించిన కేజిఎఫ్ విషయానికొస్తే మొదటి చాప్టర్ లో పేరున్న నటులు ఎవరూ పెద్దగా లేరు. కోలీవుడ్ సూపర్ స్టార్ యష్ నటించినా ఈ సినిమాకు ముందు తను బయట పెద్దగా తెలీదు. అయితే రెండో చాప్టర్ విషయానికొచ్చేసరికి దర్శకుడు సినిమా స్థాయిని మరింత పెంచుతున్నాడు. కథ రీత్యా రెండో భాగంలో కొత్త పాత్రల పరిచయం జరగనుంది. ఇప్పటికే అధీరా పాత్రకు గాను సంజయ్ దత్ ను తీసుకున్న సంగతి తెల్సిందే. తన లుక్ ను కూడా విడుదల చేసారు. మొదటి భాగంలో విలన్ కంటే మరింత పవర్ఫుల్ గా అధీరా పాత్రను దర్శకుడు తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

ఇక మరో బాలీవుడ్ తార ఈరోజు కేజిఎఫ్ 2 సెట్స్ లో జాయిన్ అయింది. ఆమె రవీనా టాండన్. ఈమె రమిక సేన్ పాత్రలో హల్చల్ చేయనుంది. మొదటి భాగంలో ఈమెను వెనక నుండి చూపిస్తారే తప్ప నటుడెవరన్నది చూపించరు. పైగా రాకీ భాయ్ పై డెత్ వారంట్ ఇష్యూ చేస్తున్నట్లుగా చూపిస్తారు. దీన్ని బట్టి రెండో భాగంలో ఈమె పాత్రకు ప్రాధాన్యత బానే ఉంటుందని అర్ధమవుతోంది. మే లేదా జులైలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.