ర‌మికా సేన్ ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది!


ర‌మికా సేన్ ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది!
ర‌మికా సేన్ ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది!

ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ సంచ‌నం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. మోన్‌స్ట‌ర్ స్టార్ య‌ష్ హీరోగా న‌టించిన ఈ క‌న్న‌డ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించింది. ప్ర‌శాంత్ నీత్ తెర‌కెక్కించిన ఈ మూవీకి ప్ర‌స్తుతం సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`కి కొనసాగింపుగా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` రూపొందుతోంది. య‌ష్‌ హీరోగా నిధి శెట్టి హీ‌రోయిన్ గా న‌టిస్తున్నారు.

బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజ‌య్‌ద‌త్ అథీరాగా ప్ర‌ధాన విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇటీవ‌లే సంజ‌య్‌ద‌త్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అథీరా లుక్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్న మ‌రో పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని మేక‌ర్స్ సోమ‌వారం రిలీజ్ చేశారు. అనంత్ నాగ్ పాత్ర‌లో ప్ర‌కాష్‌రాజ్ న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ న‌టిస్తోంది.

ర‌మికాసేన్ గా ప్ర‌ధాని పాత్ర‌లో న‌టిస్తున్న ర‌వీనా ఫ‌స్ట్ లుక్‌ని సోమ‌వారం ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. పార్ల‌మెంట్‌లో త‌న స్థానంలో రెడ్ సారీలో ఇందిరా గాంధీని త‌ల‌పిస్తూ ర‌వీనా కూర్చున్న ఫొటో ఆక‌ట్టుకుంటోంది. `కేజీఎఫ్ 2` షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌బోతున్నారు.