రాఖీ భాయ్ వ‌ర్సెస్ ర‌మీకా సేన్‌!


రాఖీ భాయ్ వ‌ర్సెస్ ర‌మీకా సేన్‌!
రాఖీ భాయ్ వ‌ర్సెస్ ర‌మీకా సేన్‌!

క‌న్న‌డ సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించిన చిత్రం `కేజీఎఫ్‌`. య‌ష్ న‌టించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించింది. క‌న్న‌డ సినిమాల్లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా రికార్డుల కెక్కింది. ప్ర‌శాంత్ నీల్ ఏ టార్గెట్‌ని రీచ్ కావాల‌ని రూపొందించాడో ఆ బౌండ‌రీ దాటేసి వ‌ర‌ల్డ్ వైడ్‌గా క‌న్న‌డ సినిమా స‌త్తాఏంటో నిరూపించింది. దీంతో ఈ చిత్ర చాప్ట‌ర్ 2 పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే మ‌రిన్ని మెరుపుల్ని ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు జ‌త చేస్తున్నాడు.

సంజ‌య్‌ద‌త్ అధీరాగా మోస్ట్ డేంజ‌ర‌స్ విల‌న్‌గా ఇందులో క‌నిపించ‌బోతున్నారు. మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ర‌మికాసేన్‌గా ర‌వీనా టాండ‌న్ న‌టిస్తున్నారు. రావు ర‌మేష్ ఏ పాత్ర‌లో కనిపిస్తారో ఇంకా క్లారిటీ లేదు. మూడు కీల‌క ఫైట్‌ల‌తో మాస్ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త ట్రీట్‌ని ఇవ్వ‌బోతున్నారు ప్ర‌శాంత్ నీల్‌. ఇటీవ‌ల ర‌వీనా ఎంట్రీకి సంబంధించిన విష‌యాన్ని ప్ర‌క‌టించి ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటో రివీల్ చేసేశాడు.

తాజాగా ర‌వీనా టాండ‌న్‌తో వున్న ఓ ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేసిన రాఖీభాయ్ ఉరాఫ్ య‌ష్ ఆ ఫోటోకి ఆస‌క్తిక‌ర పోస్ట్‌ని జ‌త‌చేయడం ఆక‌ట్టుకుంటోంది. రాఖీ సామ్రాజ్యంలో అడుగు పెట్టేందుకు తాను మాత్రం వెల్కమ్‌ చెప్ప‌న‌ని, అయితే ర‌వీనా మేడ‌మ్‌కి మాత్రం ఈ య‌స్ హోమ్ టౌన్‌కు స్వాగతం చెబుతాన‌ని
, ఆ మె ఈ చిత్రంలో న‌టించడం త‌న‌కు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని య‌ష్ పోస్ట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటోలో ర‌వీనా మాత్రం బ్లాక్ డ్రెస్‌లో కళ్ల‌కు బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని సీరియ‌స్‌గా చూస్తున్న తీరు ఈ ఇద్ద‌రి మ‌ధ్య సినిమాలో ఎలాంటి వైరం వుంటుందో చెప్ప‌క‌నే చెప్పేస్తోంది.

Credit: Instagram