“ఆవిరి”తో వస్తోన్న రవిబాబు

Ravi babu next film AAVIRI
Ravi babu next film AAVIRI

మొదటి చిత్రం అల్లరితో తన కెపాసిటీని కేపబిలిటీని నిరూపించుకున్నటాలెంటెడ్ దర్శకుడు రవిబాబు.

విలన్ గా క్రూరత్వం చూపిస్తూనే.. జోవియల్ పాత్రలతో నటుడిగా తన కామెడీతో ఎంటర్టైన్మెంట్ చేయగలడు ఆయన.

ఒక పక్క థ్రిల్లర్ సినిమాలు మరో పక్క ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తీయగల సత్తా వున్న డైరెక్టర్ రవిబాబు. కేవలం 13 చిత్రాలకు దర్శకత్వం వహించిన రవిబాబు అన్ని జోనర్స్లో ని టచ్ చేసాడు.

రీసెంట్ గా ఆయన అదుగో అంటూ పందిపిల్ల నేపథ్యంలో ఒక సినిమాని తీశారు. ఆ చిత్రం అట్టర్ ప్లాప్ అయింది. అది హిట్ అయి ఉంటే అదుగో పార్ట్-2 కూడా తీశేవారు.

మొదటిది పరాజయం కావడంతో రెండో పార్ట్ మొత్తానికి ఆ సీక్వెల్ ఆగిపోయింది. ఇక రవి బాబు నెక్స్ట్ ఎలాంటి చిత్రం చేస్తాడా అనేది సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొని వుంది.

ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో నూతన నటీ నటులతో హర్రర్ నేపథ్యంలో “ఆవిరి” చిత్రాన్ని రవిబాబు రూపొందిస్తున్నారని తెలిసింది. రెగ్యులర్ ఫిలిమ్స్ కి బిన్నంగా ఈ ఆవిరి చిత్రం నిర్మిస్తున్నారని చిత్ర యూనిట్ లో టాక్ వినిపిస్తోంది.

కచ్చితంగా ఈ ఆవిరి చిత్రం పెద్ద హిట్ అవడం ఖాయమని ఇండస్త్రీలో వార్తలు వినిపిస్తున్నాయి… అతి త్వరలో ఆవిరి చిత్రానికి సంభందించిన విశేషాలను తెలపనున్నారు..!!