ఆ నటుడు కేజిఎఫ్ అధీరా పాత్రకు డబ్బింగ్ మొదలెట్టేసాడు!


ఆ నటుడు కేజిఎఫ్ అధీరా పాత్రకు డబ్బింగ్ మొదలెట్టేసాడు!
ఆ నటుడు కేజిఎఫ్ అధీరా పాత్రకు డబ్బింగ్ మొదలెట్టేసాడు!

అన్ని విధాలుగా అంచనాలు రేకెత్తిస్తున్న చిత్రంగా కేజిఎఫ్ చాప్టర్ 2 గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమా మొదటి భాగం సాధించిన వసూళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి. ఇక చాప్టర్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రంలో యష్ కు ప్రతినాయకుడి పాత్రలో సంజయ్ దత్ నటిస్తోన్న విషయం తెల్సిందే. అధీరా పాత్రను పోషిస్తున్నాడు సంజయ్ దత్. మరికొన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సంజయ్ దత్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్యాన్సర్ నుండి కోలుకుంటుండడంతో సంజయ్ దత్ లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక కేజిఎఫ్ 2 కు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం అధీరా పాత్రకు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ డబ్బింగ్ చెబుతున్నాడు. అటు కన్నడ, ఇటు తెలుగు వెర్షన్స్ లో అధీరా పాత్రకు రవి శంకర్ డబ్బింగ్ చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వర్క్స్ నడుస్తున్నాయి.

హోంబేలె ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.