చెక చెకా సినిమాలు చేస్తున్న మాస్ రాజా!!


Ravi Teja
Ravi Teja

అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం పరాజయం తర్వాత రవితేజ ఆచి తూచి అడుగేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించేడిస్కో రాజాచిత్రం షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

ఇదిలా ఉండగాఆర్ ఎక్స్ 100′ దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన స్టోరీ నచ్చడంతో రవితేజ ఇమ్మీడియట్ గా ఒకే చేసినట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ అధినేత జెమిని కిరణ్ నిర్మించనున్నారు.. ఈ చిత్రంలో ముంబై ముద్దుగుమ్మ అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించే అవకాశం వుంది.

మరో పక్క గోపీచంద్ మలినేని కథ కూడా ఫైనల్ చేసారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో డాన్ శీను, పవర్, చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలిసింది. అలాగే వివి వినాయక్ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.. వన్ బై వన్ సినిమాలు చేస్తూ మాస్ రాజా రవితేజ ఈ ఇయర్ అంతా బిజీ కానున్నాడు..!!