మన మాస్ రాజా – ఐస్లాండ్ లో కూడా మాస్ అంటా

Ravi Teja Disco Raja Island latest update
Ravi Teja Disco Raja Island latest update

మన టాలీవుడ్ మాస్ మహారాజా  “రవి తేజ” గారు ఇప్పుడు ఐస్లాండ్ లో ఉన్నారు, తన 66 వ సినిమాగా చిత్రీకరణ జరుపుకుంటున్న “డిస్కో రాజా” ఈ మధ్య గోవా లో చిత్మురీకరణ ముగించుకుని, తదుపరి షెడ్యూల్ “ఐస్లాండ్” కి చేరుకుంది.

సినిమా అన్న తర్వాత షెడ్యూల్స్ ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి అని కొట్టిపారేయకండి ఇక్కడే అసలు కథ ఉంది. మన మాస్ మహారాజా సినిమా గురించి, షెడ్యూల్ గురించి  ఐస్లాండ్ లోని ఒక లోకల్ న్యూస్ ఛానల్ మరియు అక్కడి  పేపర్ లో వచ్చింది. అలా ఒక్కసారి గా వేరే దేశంలో మన హీరో గురించి అలా రావడం తో రవితేజ అభిమానులు తెగ గంతులు వేసేస్తున్నారు.

నిజంగా ఒక తెలుగు సినిమా  గురించి వేరే దేశం వాళ్ళు మాట్లాడుకోవడం “బాహుబలి” సినిమా నుండి మారిపోయింది, ఎప్పుడైతే అలా ఒక్కసారిగా మన తెలుగు సినిమాల పై పక్క దేశం వాళ్ళ ప్రభావం పడిందో, మన తెలుగు వాళ్ళు కూడా కొత్తగా అడుగులు వేస్తున్నారు. నిజంగా ఇది శుభసూచికమే అని చెప్పాలి.