మాస్ మహారాజ్ కి మరో హిట్ గ్యారంటీ


Ravi Teja Disko Raja Movie Teaser Decoded
Ravi Teja Disko Raja Movie Teaser Decoded

మాస్ మహారాజా తర్వాత సినిమా డిస్కో రాజా. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న సినిమా ఇది. గత కొన్ని సినిమాలులో తెలుగు సినిమా ప్రేక్షకులు మరియు ఆయన అభిమానులు రవితేజ సినిమాలలో ఉండే ఆయన మార్క్ ఎనర్జీ,కామెడీ మ్యాజిక్ మిస్ అవుతోంది అని అంటున్నారు. అసలు రవితేజ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలామందికి ఈ సినిమా కూడా రోటీన్ కథ ఏమో.? అని సందేహాలు వచ్చాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూసి తెలుగు సినిమా ప్రేక్షకులు రవితేజ అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.

ఎందుకంటే తెలుగు సినిమాల్లో మెడికల్ మాఫియా మీద ఈ మధ్య అసలు సినిమాలు రాలేదు. అందులోనూ రవితేజ లాంటి నటుడు ఈ మధ్య ఇలాంటి జోనర్ సినిమాలు చేయలేదు. రవితేజ కెరీర్ లో మొట్టమొదట వస్తున్న ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. తమిళంలో మెడికల్ మాఫియా మరియు సైన్స్ ఫిక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చినా కూడా, పెద్ద హీరోలు ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్టులు చేయలేదు.

ఇంకా సందీప్ కిషన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈ సినిమా డైరెక్టర్ విఐ ఆనంద్ గతంలో నిఖిల్ తో “ఎక్కడికి పోతావు చిన్నవాడా” మరియు మన ఆలిండియా అస్సాం స్టార్ అల్లు శిరీష్ తో “ఒక్కక్షణం” సినిమాలు చేశాడు. నిఖిల్ తో గతంలో “సూర్య వర్సెస్ సూర్య” అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన యువ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ప్రస్తుతం డిస్కో రాజా సినిమా కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా వ్యవహరిస్తున్నాడు. ఇక రవితేజ “కిక్” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అతి త్వరలో సెంచరీ దిశగా దూసుకెళుతున్న తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.

డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నతేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ప్రారంభంలో వెనకనుండి మాస్క్ తీసుకుంటూ, చేతిలో మందు గ్లాస్ తో స్టైల్ గా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు మన మాస్ రాజా రవితేజ. ఇక ప్రపంచంలో ఎప్పుడు ప్రజల మీద పరిశోధనలు చేసి కోట్ల రూపాయలు సంపాదించే కొన్ని మాఫియా గ్రూపులు ఉంటాయి అని అందరికీ తెలిసిందే కదా.! వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ ఈ సినిమా టీజర్ లో “మెడిసిన్ విల్ చేంజ్ వెరీ నేచర్ విత్ ద నేచర్” అంటూ ఒక డైలాగ్ వినబడుతుంది.

“ఎక్స్పరిమెంట్ చేయటానికి వీడు అయితేనే కరెక్ట్.. వీడు వెనకాల నో రికార్డ్స్; నో రిపోర్ట్స్” అని కొంతమంది రవితేజ గురించి కన్ఫామ్ చేసుకోవటం గమనించవచ్చు. మరి కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య ఇంకా క్లినికల్ రీసెర్చి కాకుండానే రవితేజ బయటకు రావడం, అలా వచ్చిన మనిషి కొంచెం వెరైటీగా ప్రవర్తించటం, టీజర్ చివరలో చుట్టూ ఉన్న అందారూ గన్స్ పెడితే, మనోడు కూల్ గా మ్యూజిక్ వింటూ, ఆ గన్స్ వాళ్ళకే రివర్స్ లో ఎయిమ్ చేసి వేసెయ్యడం ఇవన్నీ మనం టీజర్ లో అబ్జర్వ్ చేయొచ్చు.

ఇక చివరగా, టీజర్ లో నాకు నచ్చిన డైలాగ్ “వి ఆర్ గోయింగ్ టు బి గాడ్స్”. ఈ డైలాగు వింటుంటే నాకు ప్రపంచాన్ని ఇప్పటికీ రహస్యంగా పరిపాలిస్తున్న ఇల్యూమినాటీ సొసైటీ గుర్తొస్తోంది. ఏది ఏమైనా, ఈ సంవత్సరం సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి, ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ సినిమా “ఇస్మార్ట్ శంకర్” రేంజ్ లో మన మాస్ మహారాజ్ నటించిన “డిస్కో రాజా” సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం.