ఓటీటీకి సై అంటున్న మాస్ మ‌హారాజా?


ఓటీటీకి సై అంటున్న మాస్ మ‌హారాజా?
ఓటీటీకి సై అంటున్న మాస్ మ‌హారాజా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్నారా? అంటే అవుననే స‌మాధానం వినిపిస్తోంది. కీర్తిసురేష్‌, అక్ష‌య్‌కుమార్ త‌ర‌హాలోనే సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ట‌. ఈ ఇద్ద‌రి త‌ర‌హాలోనే ఓటీటీకి సై అంటున్నార‌ట‌. కీర్తి సురేష్ న‌టించిన `పెంగ్విన్‌` ఓటీటీలో రిలీజైన విష‌యం తెలిసిందే. మ‌రో చిత్రం `మిస్ ఇండియా` రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇదే త‌ర‌హా‌లో అక్ష‌య్ కుమార్ న‌టించిన `ల‌క్ష్మీబాంబ్‌` కూడా ఓటీటీ బాట‌ప‌ట్టిన విష‌యం తెలిసిందే.

వీరిలాగే మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓటీటీకి సై అంటున్నార‌ట‌. ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌ని ర‌వితేజ నిర్మాత‌కు క్లియ‌ర్‌గా చెప్పిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని మేలోనే రిలీజ్ చేయాల్సింది. క‌రోనా కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డింది. ప‌లు ఓటీటీ కంప‌నీలు ఆఫ‌ర్ ఇచ్చినా మేక‌ర్స్ అందుకు స‌సేమిరా అంటున్నారు.

అయితే ర‌వితేజ తాజా నిర్ణ‌యంతో మేక‌ర్స్‌లో మార్పు వ‌చ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఓ ఓటీటీ సంస్థ‌తో మేక‌ర్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. బ‌డ్జెట్‌కు త‌గ్గ ఆఫ‌ర్‌ ల‌భిస్తే `క్రాక్‌` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇటీవ‌లే టాక్స్ మొద‌లు పెట్టార‌ట‌. అవి కొలిక్కి వ‌స్తే ఓటీటీలో లేదంటే థియేట‌ర్స్ రీఓపెన్ అయ్యే వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.