`క్రాక్‌` కోసం రంగంలోకి ర‌వితేజ‌!

`క్రాక్‌` కోసం రంగంలోకి ర‌వితేజ‌!
`క్రాక్‌` కోసం రంగంలోకి ర‌వితేజ‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స‌ర‌స్వ‌తీ ఫ‌లింస్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుద‌లై సంక్రాంతి చిత్రాల రేసులో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ముందు అనుకున్న థియేట‌ర్లు కొన్ని కార‌ణాల వ‌ల్ల త‌గ్గ‌డంతో సినిమా టాక్‌ని బ‌ట్టి మ‌ళ్లీ పెంచేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ 30 కోట్లు వ‌సూలు చేసింది. రానున్న రోజుల్లో చెప్పుకోద‌గ్గ సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో `క్రాక్‌` క‌లెక్ష‌న్స్ మ‌రింతగా పెరిగే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని ఆహాలో ఈ నెల 29న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇది ఈ మూవీ క‌లెక్ష‌న్‌ల‌కి పెద్ద అడ్డంకిగా మార‌బోతోంది. దీంతో ర‌వితేజ రంగంలోకి దిగార‌ట‌.

ఈ చిత్రాన్ని ఆహా కోసం అల్లు అర‌వింద్ 8.25 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. అమెజాన్ పోటీప‌డినా `ఆహా`లో భారీ చిత్రం వుండాల‌ని మ‌రీ `క్రాక్‌`ని ద‌క్కించుకున్నారు. అయితే ఈ నెల 29న స్ట్రీమింగ్ చేయ‌కుండా ఓ వారం ఆల‌స్యంగా స్ట్రీమింగ్ చేయాల‌ని స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ని హీరో ర‌వితేజ రిక్వెస్ట్ చేసిన‌ట్టు తెలిసింది. దీనికి అల్లు అర‌వింద్ కూడా సానుకూలంగా స్పందించార‌ట‌. దీంతో మ‌రో వారం రోజులు థియేట‌ర్ల‌లో `క్రాక్‌`కి డోకా వుండ‌ద‌ని తెలుస్తోంది.