మాస్ రాజా `క్రాక్` కోసం ట్రాకెక్కేశాడు!

మాస్ రాజా `క్రాక్` కోసం ట్రాకెక్కేశాడు!
మాస్ రాజా `క్రాక్` కోసం ట్రాకెక్కేశాడు!

గ‌త ఏడు నెల‌లుగా మూవీ షూటింగ్స్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా స్టార్ హీరోల సినిమాల షూటింగ్‌ల‌న్నీ ఒక్కొక్క‌టి పునః ప్రారంభం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్ బిఫోర్ ఆగిపోయిన మాస్ రాజా ర‌వితేజ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ బుధ‌వారం మొద‌లైంది.
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌`.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `బ‌లుపు` చిత్రం త‌రువాత మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శృతిహాస‌న్ ఈ మూవీతో మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మస్తున్నారు. క‌‌రోనా దెబ్బ‌తో చివ‌రి ద‌శ షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోవ‌డంతో ఈ చిత్ర రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది.

ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. పోలీస్ గెట‌ప్‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ సెట్‌లో ఎంట‌ర్అవుతున్న ఫొటోని చిత్ర బృందం బుధ‌వారం షేర్ చేసింది. `క్రాక్‌` లాస్ట్ షెడ్యూల్ ఇది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌ని చిత్ర బృందం హోరెత్తించ‌డానికి ప్లాన్ చేస్తోంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఈ మూవీపై ర‌వితేజ కూడా భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.