సై అనాలా వ‌ద్దా..డైల‌మాలో `క్రాక్` టీమ్‌?


సై అనాలా వ‌ద్దా..డైల‌మాలో `క్రాక్` టీమ్‌?
సై అనాలా వ‌ద్దా..డైల‌మాలో `క్రాక్` టీమ్‌?

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు తెరుచుకోవ‌డం ఇప్ప‌ట్లో జ‌రిగేలా లేదు. ఇఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే క్రేఈ చిత్రాలు భారీ స్థాయిలో న‌ష్ట‌పోయే అవ‌కాశం వుంది. వ‌డ్డీల రూపంలో భారీగా చెల్లించాల్సి వుంటుంద‌ని గ్ర‌హించిన కొంత మంది నిర్మాత‌లు త‌మ చిత్రాల‌ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లో రిలీజ్ చేయ‌డానికి ముందుకొస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగులో క్రేజీ చిత్రాల డైరెక్ఠ్ ఓటీటీ రిలీజ్ ప్ర‌క్రియ నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న `వి` సినిమాతో మొద‌లైంది.

ఇదే బాట‌లో మ‌రికొన్ని చిత్రాలు కూడా ఓటీటీ బాట ప‌ట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ జాబితాలో అనుష్క నిశ్శ‌బ్దం, రామ్ రెడ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌, క‌ల‌ర్ ఫొటోరెడీ అవుతున్నాయి. అయితే మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న `క్రాక్‌` చిత్రం కూడా ఈ జాబితాలో చేర‌డానికి ఊగీస‌లాడుతోంద‌ట. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ పూర్త‌యి రిలీజ్‌కి రెడీగా వున్న ఈ  చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని హీరో ర‌వితేజ‌, లేదు థియేట‌ర్‌లోనే రిలీజ్ చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని చెబుతూ వ‌స్తున్నారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ర‌వితేజ మీసం మెలేస్తూ కూల్ డ్రింక్ తాగుతున్న ఓ స్టిల్‌ని రిలీజ్ చేయ‌డంతో మ‌ళ్లీ అనుమానాలు మొద‌ల‌య్యాయి. మ‌రి దీనిపై ద‌ర్శ‌కుడు, చిత్ర బృందం ఎలాంటి కామెంట్ చేస్తారో చూడాలి.