మాస్ మ‌హారాజా బ్ర‌ద‌ర్‌లా వున్నాడే!


మాస్ మ‌హారాజా బ్ర‌ద‌ర్‌లా వున్నాడే!
మాస్ మ‌హారాజా బ్ర‌ద‌ర్‌లా వున్నాడే!

మాస్ మ‌హీరాజా ర‌వితేజ ఎన్ని హిట్లు వ‌చ్చినా. ఫ్లాప్‌లు వ‌చ్చినా ఎప్పుడూ ఒకేలా స్పోర్టీవ్ మెంటాలిటీతో న‌వ్వుతూ వుంటారు. ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపుల్లో వున్న ఆయ‌న చాలా చ‌లాకీగా క‌నిస్తున్నారు. రెండు మూడు ప్రాజెక్ట్‌ల‌ని లైన్‌లో పెట్టిన హీరో ‌ర‌వితేజ త్వ‌ర‌లోనే త‌న `క్రాక్‌` చిత్ర షూటింగ్‌ని ప్రారంభించ‌బోతున్నారు. ఈ చిత్రానికి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ర‌వితేజ ఆదివారం షేర్ చేసిన ఫొటో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఫొటోపై అభిమానుల్లోనే కాదు ఫిల్మ్ సెల‌బ్రిటీల్లోనూ చ‌ర్చ మొద‌లైంది. వివ‌రాల్లోకి వెళితే ఆదివారం `డాట‌ర్స్ డే` జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ షేర్ చేసిన ఫోటో నెటిజ‌న్స్‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. `హ్యాపీ డాట‌ర్స్ డే` సంద‌ర్భంగా ర‌వితేజ త‌న కూతురితో క‌లిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేశారు.

కొన్నేళ్ల క్రితం చ‌బ్బీ బుగ్గ‌ల‌తో క‌నిపించిన ఆ చిన్నారి ఇప్పుడు తండ్రి ప‌క్క‌న కూతురిలా కాకుంగా సోద‌రిలా క‌నిపిస్తోంది. ఇదే విష‌యాన్ని చాలా మంది నెటిజ‌న్స్ వ్య‌క్త‌ప‌రిచారు కూడా. ఈ ఫొటోలో ఇద్ద‌రు తండ్రీ కూతుళ్లుగా కాకుండా అన్నా చెల్లెళ్లుగా క‌నిపిస్తున్నార‌ని నెటిజ‌న్స్ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం ర‌వితేజ త‌న కూతురితో దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

 

View this post on Instagram

 

Happy daughter’s day❤️

A post shared by RAVI TEJA (@raviteja_2628) on