మాస్ మ‌హారాజా మ‌రో పిరియాడిక్ ఫిల్మ్?


మాస్ మ‌హారాజా మ‌రో పిరియాడిక్ ఫిల్మ్?
మాస్ మ‌హారాజా మ‌రో పిరియాడిక్ ఫిల్మ్?

మాస్ రాజా ర‌వితేజ మ‌రోసారి పిరియాడిక్ ఫిల్మ్ చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇటీవ‌ల వి.ఐ. ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `డిస్కోరాజా`. 1980 కాలం నాటి డాన్‌గా విభిన్న‌మైన పాత్ర‌లో ర‌వితేజ న‌టించారు. పిరియాడిక్ చిత్రంగా రూపొందిన ఈ మూవీ బాక్సీఫీస్ వ‌ద్ద ఊహించ‌ని స్థాయిలో ప‌రాజ‌యాన్ని చ‌విచూపింది.

అయితే ఈ మూవీ త‌రువాత కూడా మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రోసారి పిరియాడిక్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న ర‌వితేజ ఈ సినిమాతో పాటు త్రినాథ‌రావు న‌క్కినతో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ మూవీలో ర‌వితేజ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తార‌ట‌.

అయితే ఈ మూవీ కూడా `డిస్కోరాజా` త‌ర‌హాలోనే పిరియాడిక్ స్టోరీ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌వితేజ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్న `క్రాక్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. కిరాక్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తోంది. య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే రిలీజ్ కాబోతోంది.