అవి లేకుండా మాస్‌రాజా వుండ‌లేర‌ట‌!Ravi Teja regularly watch netflix and Amazon Prime
Ravi Teja regularly watch netflix and Amazon Prime

సామాన్య ప్రేక్ష‌కుల‌కు వినోదం సినిమా. లేడీస్‌కి టెలివిజ‌న్ మ‌రి కోట్ల మందిని ఎంటర్‌టైన్ చేసే యాక్ట‌ర్స్ కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఏంటి?. ఏ ముంటుంది. హాలీవుడ్ సినిమాలు. ఇవ‌న్నీ ఇప్పుడు సీడీల్లో చూడాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ వుంటే చాలు ప్ర‌తి సినిమా, వెబ్ సిరీస్ మీ ముంగిట్లోనే వాలిపోతుంది. ఇంట్లోనే వినోదాన్ని ఎంజాయ్ చేసేయోచ్చు.

స్టార్ హీరోలు గ‌త కొన్నేళ్లుగా చేస్తున్న‌ది అదే. ఈ విష‌యంలో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ మంచి హెల్ప్ ఫుల్‌గా నిలుస్తున్నాయి. సినిమాల కంటే హీరోలు ఈ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్‌లో హాలీవుడ్ వెబ్ సిరీస్‌ల‌కే అధిక ప్రాధాన్య‌త నిస్తున్నారు. స్టార్‌ల‌ని ఆక‌ట్టుకుంటున్న ఫేమ‌స్ వెబ్ సిరీస్ `నార్కోస్‌`. మెక్సికో నేప‌థ్యంలో ఇల్లీగ‌ల్ డ్ర‌గ్ మాఫియా చుట్టూ సాగే ఈ వెబ్ సిరీస్ విప‌రీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇదే విష‌యాన్ని హీరో ర‌వితేజ తాజాగా వెల్ల‌డించారు.

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ లేక‌పోతే ఉండ‌లేక‌పోతున్నాన‌ని, నెట్‌ఫ్లిక్స్‌లో వ‌చ్చే `నార్కోస్` అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తాన‌ని, మ‌న ద‌గ్గ‌ర కూడా అలాంటి క‌థ‌లు రావాల‌ని, వి.ఐ. ఆనంద్‌లో ఆ స‌మ‌ర్థ‌త వుంద‌ని చెప్పుకొచ్చాడు. అలాంటి క‌థ‌లు రాస్తే తాను అందులో న‌టించ‌డానికి ఎప్పుడూ సిద్ధ‌మేన‌ని వెల్ల‌డించారు. జ‌నాల మైండ్ సెట్ మారింది. కంటెంట్ వుంటే త‌ప్ప‌కుండా ఆద‌రిస్తున్నారు. `రంగ‌స్థ‌లం`లో కంటెంట్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వున్నాయి కాబ‌ట్టే ఆడింద‌ని, `డిస్కోరాజా` కూడా ఆ స్థాయిలో హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు.