`ఎఫ్‌3` వెంక‌టేష్ చేయ‌డం లేదా?`ఎఫ్‌3` వెంక‌టేష్ చేయ‌డం లేదా?
`ఎఫ్‌3` వెంక‌టేష్ చేయ‌డం లేదా?

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ క‌లిసి న‌టించిన ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్2`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం గ‌త ఏడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. 2019 బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి భారీ వసూళ్ల‌ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా `ఎఫ్‌3`ని చేస్తాన‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ముందే ప్ర‌క‌టించాడు.

సీక్వెల్‌లోనూ విక్ట‌రీ వెంకటేష్‌, వ‌రుణ్‌తేజ్ మ‌రోసారి క‌లిసి న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సీక్వెల్‌లో వెంక‌టేష్ న‌టించ‌డం లేద‌ని తెలుస్తోంది. కార‌ణం వెంకీ ఈ మూవీ కోసం 10 కోట్లు రెమ్యురేష‌న్ అడుగుతున్నాడ‌ట‌. అంత అయితే వర్క‌వుట్ కాద‌ని భావించిన దిల్ రాజు ఆయ‌న స్థానంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.

అనిల్ రావిపూడి కూడా రవితేజ‌వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుండ‌టంతో `ఎఫ్‌3` స్టోరీ కూడా మారుతోంద‌ట‌. ర‌వితేజకు త‌గ్గ‌ట్టుగా స్టోరీని అనిల్ రావిపూడి రీ వ్రైట్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న ఈ చి్త‌రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.