మాస్ రాజా ర‌వితేజకు ప్ర‌తి రోజు సండేన‌ట‌!

మాస్ రాజా ర‌వితేజకు ప్ర‌తి రోజు సండేన‌ట‌!
మాస్ రాజా ర‌వితేజకు ప్ర‌తి రోజు సండేన‌ట‌!

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌కు ప్ర‌తి రోజు సండే లానే వుంద‌ట‌. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దీని బారి నుంచి జ‌నాల‌ని ర‌క్షించ‌డం కోసం దేశాల‌న్నీ లాక్ డౌన్ విధించి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటిని స్వ‌చ్ ఆఫ్ మోడ్‌లోకి తీసుకెళ్లిపోయాయి. దీంతో ఎక్క‌డివి అక్క‌డే ఆగిపోయాయి. స‌ర్వం స్థంభించి పోయాయి. దీంతో సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఇంటికే ప‌రిమితం అయిపోయారు.

ఇక సినీ సెల‌బ్రిటీలైతే నిత్యం వ‌రుస షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డిపేస్తూ ఫ్యామిలీలో గ‌డిపేందుకే టైమ్ కేటాయించ‌లేని స్టార్‌లు క‌రోనా పుణ్య‌మా అని త‌మ పూర్తి టైమ్ లాక్ డౌన్ కార‌ణంగా ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు. ఎన్న‌డూ లేని విధంగా పిల్ల‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. క‌బుర్లు చెబుతున్నారు. పిల్ల‌ల‌తో క‌లిసి ఆట‌లాడుతున్నారు. పిల్ల‌ల‌తో పిల్ల‌లుగా మారి సినిమాలు చూస్తూ వారిలో త‌మ ఆనందాన్ని చూసుకుంటున్నారు.

నిత్యం షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డిపేసే మాస్ రాజా ర‌వితేజ లాక్ డౌన్ టైమ్‌ని త‌న పిల్ల‌ల‌తో గ‌డిపేస్తున్నాడు. తాజాగా ఆదివారం ఆయ‌న షేర్ చేసిన ఓ ఫొటో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. త‌న కొడుకు, కూతురుతో క‌లిసి ర‌వితేజ ఇగిన ఓ ఫొటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి దానికి ఓ క్యాప్ష‌న్ రాశారు. `ఈ క్వారెంటైన్ టైమ్‌లో ప్ర‌తి రోజే సండేనే అని ట్వీట్ చేశాడు.

 

View this post on Instagram

 

Everyday is a Sunday when quarantined. #stayhome #stayhappy

A post shared by RAVI TEJA (@raviteja_2628) on

Credit: Instagram