గోవాలో ర‌వితేజ‌, శృతిహాస‌న్ హంగామా!


గోవాలో ర‌వితేజ‌, శృతిహాస‌న్ హంగామా!
గోవాలో ర‌వితేజ‌, శృతిహాస‌న్ హంగామా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `బ‌లుపు` వంటి హిట్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే టాకీ పార్ట్ పూర్త‌యింది. ఓ పాట చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే బ్యాలెన్స్‌గా వుంది.  ఈ నేప‌థ్యంలో టీమ్ అంతా గోవా ప‌య‌నం అయింది.

గోవాలో శుక్ర‌వారం నుంచి చివరి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్‌లో ర‌వితేజ‌, శృతిహాస‌న్‌ల‌పై చివ‌రి పాట‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు. రాజు సుంద‌రం ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూరుస్తున్నారు. ఈ పాట చిత్రీక‌ర‌ణ‌తో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

నెల్లూరు నేప‌థ్యంలో ప్ర‌ధానంగా ఈ మూవీ స్టోరీ సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తోంది. లేడీ విల‌న్‌గా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ పాత్ర‌, శృతిహాస‌న్ గ్లామ‌ర్‌, త‌మ‌న్ సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌నున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `భూమ్ బ‌ద్ద‌ల్‌` సాంగ్ సూప‌ర్ హిట్ అయింది. సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది.