రవితేజతో బుల్లి ఇంద్రుడు తేజ సజ్జ

Indra fame Teja Sajja busy toning upతేజ సజ్జ గుర్తున్నాడా మీకు… బుల్లి మెగాస్టార్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడీ కుర్రాడు. అప్పట్లో బుడతడిగా వైవిధ్యమైన క్యారెక్టర్లతో, పవర్ ఫుల్ డైలాగ్స్ తో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగేందుకు కసరత్తులు ప్రారంభించాడు తేజ. అవును…. ఇంద్ర సినిమాలో సింహాసనం అధిష్టించి… తేజ సజ్జ చెప్పిన డైలాగ్స్ కి మెగాభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. విజిల్స్ తో ఎంకరేజ్ చేశారు. దీంతో పాటు చిరు నటించిన టాగూర్, ఎన్టీయార్ సాంబ, పూరీ జగన్నాథ్ బాచీ చిత్రాల్లోనూ అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో చిచ్చర పిడుగు అనిపించుకున్నాడు. ఇప్పుడు తేజ సజ్జ హీరోగా రంగ ప్రవేశం చేసేందుకు తనను తాను ఫిట్ గా మలచుకుంటున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ హీరో రవితేజతో కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తున్న చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోను స్వయంగా రవితేజ తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేయడం విశేషం. స్టార్ హీరోలు సైతం తేజ సజ్జను అంతగా లైక్ చేస్తారనడానికి ఈ ఫోటోనే నిదర్శనం.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లఘు చిత్రం డైలాగ్ ఇన్ ది డార్క్ చిత్రంలో నటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించబోతున్నారు. తాను నటించేబోయే సినిమా కోసమే తన బాడీ షేప్ ను పర్ ఫెక్ట్ గా మలచుకుంటున్నాడు. సో… త్వరలోనే తేజ సజ్జను హీరోగా తెరమీద చూడబోతున్నామన్నమాట. ఆల్ ది బెస్ట్ టు తేజ సజ్జ.