మాస్ రాజా `ఖిలాడీ` బ‌ర్త్‌డే గిఫ్ట్ అదిరిందిగా!

మాస్ రాజా `ఖిలాడీ` బ‌ర్త్‌డే గిఫ్ట్ అదిరిందిగా!
మాస్ రాజా `ఖిలాడీ` బ‌ర్త్‌డే గిఫ్ట్ అదిరిందిగా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌` ఈ సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇదే ఊపులో మాస్‌రాజా న‌టిస్తున్న మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఖిలాడీ`. `ప్లే స్మార్ట్` అని ట్యాగ్ లైన్‌. ఇటీవ‌ల `రాక్ష‌సుడు` హిట్‌తో లైన్‌లోకి వ‌చ్చిన ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌ల‌తో పాటు హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై కోనేరు సత్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌద‌రి, డింపుల్ హ‌యాతీ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. నేడు ర‌వితేజ పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఫ‌స్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేసింది.

పోర్ట్‌లో వున్న కంటైన‌ర్ ల మ‌ధ్య నుంచి చేతిలో సుత్తి ని ప‌ట్టుకుని ప్ర‌త్య‌ర్థుల‌కు అడ్డుగా వెళుతున్న ర‌వితేజ విజువ‌ల్స్ ఆ‌ట్టుకుంటున్నాయి. ఈ విజువ‌ల్స్‌కి దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించిన నేప‌థ్య సంగీతం బాగుంది. `క్రాక్‌` బ్లాక్ బస్ట‌ర్ హిట్‌తో మాంచి ఊపుమీదున్న ర‌వితేజ ఆ ఊపుని `ఖిలాడీ` విష‌యంలోనూ కొన‌సాగించేలా క‌నిపిస్తున్నాడు.