రానా త‌మ్ముడి తెరంగేట్రానికి అంతా సిద్ధం?

రానా త‌మ్ముడి తెరంగేట్రానికి అంతా సిద్ధం?
రానా త‌మ్ముడి తెరంగేట్రానికి అంతా సిద్ధం?

ప్ర‌ముఖ నిర్మాత, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధ‌వ‌నేత‌ డి. సురేష్ బాబు  చిన్న కుమారుడు, హీరో ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ దగ్గుబాటి వెండితెర అరంగేట్రం గురించి చాలా రోజులుగా వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే.  అయితే ఈ వార్త‌ల్ని ఎప్పిక‌ప్పుడు కండిస్టూ అలాంటిది ఏమీ లేద‌ని డి. సురేష్‌బాబు చెబుతూ వ‌స్తున్నారు.

తాజాగా మరోసారి అభిరామ్ అరంగేట్రంపై వార్త‌లు మొద‌ల‌య్యాయి. అయితే ఈ వార్త‌లు నిజ‌మేన‌ని,  ఈ సారి అభిరామ్ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ త్వ‌ర‌లోనే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నుంచి రాబోతోంద‌ని  తెలుస్తోంది. అభిరామ్ హీరోగా తెరంగేట్రం చేయ‌నున్న మొదటి చిత్రానికి నటుడు కమ్ దర్శకుడు రవి బాబు దర్శకత్వం వహిస్తార‌ట‌.

విభిన్న‌మైన క‌థ‌ల‌తో సినిమాలు తీసే ర‌విబాబు ఈ సారి త‌న పంథాకు భిన్న‌మైన క‌థ‌ని అభిరామ్ కోసం సిద్ధం చేసి ఆ క‌థ‌ని సురేష్ బాబుకు వినిపించార‌ట‌. స్టోరీ న‌చ్చ‌డంతో సురేష్‌బాబు వెంట‌నే ర‌విబాబుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. గ‌తంలో ర‌విబాబు, సురేష్‌బాబు క‌లిసి చాలా చిత్రాలకు ప‌ని చేశారు. అలా ఇద్ద‌రూ క‌లిసి చేసిన చిత్రాలు చాలా వ‌ర‌కు విజ‌యాల్ని సాధించాయి. అదే న‌మ్మ‌కంతో ర‌విబాబుకు అభిరామ్‌ని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ల్ని సురేష్‌బాబు అప్ప‌గించాని తెలుస్తోంది.