ఎన్టీఆర్ తో పోటీ పడుతున్న పందిపిల్ల


ravibabus pandipilla adugo with ntrs aravinda sametha రకరకాల జంతువులు , పశువులు ప్రధాన పాత్రల్లో నటించిన బోలెడు చిత్రాలను చూసాం కానీ తొలిసారిగా ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో కనిపించనున్న చిత్రం” అదుగో ” విడుదలకు రెడీ అవుతోంది . రవిబాబు దర్శకత్వం వహించడమే కాకుండా తానే నిర్మించాడు ఈ పందిపిల్ల చిత్రాన్ని . ఈ సినిమా ఇప్పటిది కాదు దాదాపు రెండేళ్లు కావస్తోంది సినిమా ప్రారంభించి అయితే పందిపిల్ల సినిమా కాబట్టి గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్రాఫిక్స్ సరిగా రాకపోవడంతో మళ్ళీ మళ్ళీ చేయించి ఇప్పటికి రెడీ చేసాడట . ఇక ఆ పందిపిల్ల చిత్రాన్ని విడుదల చేయడమేనట !

దసరా కానుకగా పందిపిల్ల ” అదుగో ” చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు రవిబాబు .యితడు నటుడు , దర్శకుడు కూడా అయితే దర్శకుడిగా చాలా గ్యాప్ వచ్చింది రవిబాబు కు . పైగా ప్లాప్ చిత్రాలతో ఇబ్బంది పడుతున్నాడు రవిబాబు , మరి ఈ పందిపిల్లతో హిట్ కొడతాడా చూడాలి . అయితే దసరా సందర్బంగా అక్టోబర్ లో సినిమా రిలీజ్ అంటే రవిబాబు కు ఇబ్బందే ఎందుకంటే ఆ సమయంలో ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా విడుదల కానుంది మరి .

English Title: ravibabus pandipilla adugo with ntrs aravinda sametha