కోరిక తీర్చమని అతడ్ని వేధించారట హీరోయిన్ లు


ravikishan sensational comments on heroines

కాస్టింగ్ కౌచ్ అన్నది గతకొంత కాలంగా చిత్రపరిశ్రమలో నానుతున్న అంశం కాగా ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం పెను సంచలనం సృష్టించింది . కాగా ఆ కాస్టింగ్ కౌచ్ కి భిన్నంగా భోజ్ పురి నటుడు రవికిషన్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . హీరోయిన్ లతో పాటు మిగతా నటీమణులు మగవాళ్ల నుండి ఇబ్బంది ఎదుర్కొని ఉండొచ్చు కానీ కొంతమంది హీరోయిన్ లు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు హీరోలను , మిగతా నటులను సెక్స్ కోసం వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నాడు రవికిషన్ . అల్లు అర్జున్ హీరోగా నటించిన ” రేసు గుర్రం ” చిత్రంలో మెయిన్ విలన్ గా నటించాడు ఈ రవికిషన్ , అలాగే హీరోయిన్ నగ్మా తో కొంతకాలం ప్రేమాయణం సాగించాడు కట్ చేస్తే ….. ఇద్దరి మద్య విబేధాలు రావడంతో లవ్ బ్రేకప్ అయ్యింది .

ఫిలిం ఇండస్ట్రీ అనగానే మగవాళ్ల పై ఆరోపణలు చేస్తున్నారు కానీ పలువురు హీరోయిన్ లు మత్తులో తూగి వాళ్ళ కోరిక తీర్చమని పోరు పెడుతున్నారని ఆ హింస కూడా ఉందని కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని అంటున్నాడు . రవికిషన్ మాటలు వింటే అందరూ నోరెళ్ళ బెట్టడం ఖాయం ఎందుకంటే మా జీవితాలను నాశనం చేస్తున్నారని మహిళా నటీమణులు పేర్కొంటుండగా మగవాళ్ళు సైతం మాకు రక్షణ లేదంటూ ముందుకు రావడంతో అందరి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . సెక్స్ కోసం తపించే హీరోయిన్ లు ఎవరా ? అని ?