రవిప్రకాష్ కొత్త ఛానల్ టీవీ 36


ravi prakash tv36 channel
ravi prakash tv36 channel

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కొత్త ఛానల్ కు రంగం సిద్ధమైంది . టీవీ 36 పేరుతో సరికొత్త న్యూస్ ఛానల్ ని పెట్టేపనిలో ఉన్నాడట రవిప్రకాష్ . టీవీ 9నుండి రవిప్రకాష్ కు ఉద్వాసన పలకడంతో పాటుగా పలు కేసులు కూడా నమోదయ్యాయి . అయితే ఆ కేసుల సంగతి ఏమైయ్యిందో కానీ రవిప్రకాష్ తాజాగా టివి 36 అనే పేరుతో న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాడు .

కేసీఆర్ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్న రవిప్రకాష్ కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఆశ్రయించాడట ! వాళ్ళ వల్లే రవిప్రకాష్ పై పెట్టిన కేసులతో జైలు కెళ్ళాల్సిన వాడు జైలు కెల్లకుండా దర్జాగా బయటే తిరుగుతున్నాడు . ఇక ఈ ఛానల్ ని పెట్టింది టీవీ 9 కొత్త యాజమాన్యంపై కసితోనట ! అందుకే సంచలనాత్మక కథనాలతో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ఉండాలని ప్లాన్ చేసాడట . త్వరలోనే ఈ ఛానల్ ప్రసారాలు ప్రారంభం కానున్నాయట .