మాస్ హీరోల పంతం ఎప్పటికి తగ్గుతుందో?


మాస్ హీరోల పంతం ఎప్పటికి తగ్గుతుందో?
మాస్ హీరోల పంతం ఎప్పటికి తగ్గుతుందో?

టాలీవుడ్ లో ఇద్దరు హీరోలకి ఇదివరకే ఒక హీరోయిన్ విషయంలో బాగా గొడవలు అయ్యాలి అని రూమర్లు వచ్చాయి. అది ఎంతవరకు నిజమో? అందులో అంత జరిగిందా? అనే దానికి ఎవ్వరి దగ్గర 1% సమాధానం కూడా లేదు. అంటే కావాలని ప్రచారం చేసారా? అంటే అందులో కూడా 1% నమ్మకం లేదు. ఆ ఇద్దరు హీరోలు ఒకలు మాస్ మహారాజ్ ‘రవితేజ’ గారు, ఇంకొకలు నట సింహం నందమూరి ‘బాలకృష్ణ’ గారు.

బాలయ్య గారి గురించి రవితేజ గారు ఒక హీరోయిన్ దగ్గర అతిగా మాట్లాడటం వలన బాలయ్య గారు రవితేజ గారిని పిలిపించి మందలించారు అని ప్రచారం జరిగింది. ఆ హీరోయిన్ అయిన ‘మీరా జాస్మిన్’ గారిని కూడా ఇలా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టినందుకు అభిమానులకి నచ్చలేదు. అందుకే రవితేజ సినిమాకి బాలకృష్ణ గారి సినిమాలు ఎమన్న పోటీకి దిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగేది. గొడవ ఎప్పుడో జరిగినా దానిని ఇంకా మర్చిపోలేని వాళ్ళు కూడా ఉన్నారు. రవితేజ గారి సినిమాలు బాలకృష్ణ సినిమాకి పోటీగా విడుదల అయ్యి ఎక్కువగా విజయం పొందాయి.

2008 సంక్రాంతికి బాలకృష్ణ ‘ఒక్క మొగాడు’ సినిమాకి పోటీగా రవితేజ ‘కృష్ణ’ సినిమా విడుదల అయ్యింది రెండింటిలో రవితేజ గారి ‘కృష్ణ’ సినిమా బాగా విజయవంతం అయ్యింది. 2011 సంక్రాంతికి బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ విడుదల అయితే రవితేజ గారి ‘మిరపకాయ్’ సినిమా విడుదల అయ్యింది. ఇంకేముంది మళ్ళీ రవితేజ గారికి విజయం దక్కింది. 2012 సమ్మర్ సీజన్లో కొంచెం సీన్ రివర్స్ అయ్యింది. రవితేజ గారి ‘దరువు’ అలాగే బాలకృష్ణ గారి ‘అధినాయకుడు’ సినిమాలు పోత పోటీగా విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ సినిమా యూనిట్ వాళ్ళు మళ్ళీ గొడవలు పెంచడం ఇష్టం లేక దరువు సినిమా వచ్చిన ఒక వారం తర్వాత అధినాయకుడు విడుదల అయ్యింది.

దరువు సినిమా అలాగే అధినాయకుడు సినిమాలు రెండు వారి కెరీర్ లో పెద్ద డిసాస్టర్ అయ్యాయి. దరువు సినిమా అధినాయకుడు కంటే మళ్ళీ కొంచెం ఎక్కువ ఓట్లు సంపాదించుకుంది. చూసుకుంటే రవితేజ గారు బాలకృష్ణ గారికి సినిమాల పరంగా గట్టి పోటీ అని తేలిపోయింది. అయితే రాబోవు సినిమాలు అనగా రవితేజ గారి ‘డిస్కోరాజా’ మరియు బాలకృష్ణ- కే.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఇంకా పేరు లేని (పరిశీనలలో ఉన్న పేరు ‘రూలర్’) సినిమాని ఒకేసారి పోటీగా 2019 క్రిస్టమస్ కి విడుదల చేయాలి అని అనుకుంటున్నారు.

అయితే రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటడం వలన సినిమా ఏకంగా ఫిబ్రవరి కి పోస్ట్ పోన్ అయ్యిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా కూడా క్రిస్టమస్ కి విడుదల అవ్వాలి కానీ ఆ సినిమా కూడా వాయిదా పడింది. అయితే బాలకృష్ణ గారి సినిమాకి పోటీగా సాయి ధరమ్ తేజ్ ‘ప్రతి రోజు పండగ’ సినిమా విడుదల అవుతుంది. ఇంతకీ మరి బాలకృష్ణ గారి సినిమా కచ్చితంగా క్రిస్టమస్ కి విడుదల అవుతుందా? అంటే అందులో కొంచెం కూడా సందేహం లేకుండా ఎక్కువ మంది కష్టమే అంటున్నారు. కారణం సినిమా యూనిట్ వాళ్ళు సినిమా గురించి ఒక్క ప్రచారం కూడా బయటికి రానివట్లేదు.

ఈ రోజు సాయంత్రం 7:00 గంటల సమయంలో రవితేజ గారు నటిస్తున్న డిస్కో రాజా సినిమా నుండి మొదటి పాట ‘నువ్వు నాతో ఏమన్నవో’ ని విడుదల చేయబోతున్నారు. విశ్వసనీయ సమాచారాల ప్రకారం ఆ పాటని ‘ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం’ గారు పాడారు అంటున్నారు.