ఆ సినిమా ఆగిపోయిందట


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తమిళంలో ఘనవిజయం సాధించిన తేరి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది . సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు మైత్రి మూవీ మేకర్స్ . అసలు మొదట ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరో అనుకున్నారు పవన్ కూడా చేస్తానని అన్నాడట !

కానీ రాజకీయాల్లోకి పవన్ వెళ్ళిపోయాడు దాంతో రవితేజ తో తేరి రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యారు కట్ చేస్తే ఇప్పుడు ఆ సినిమా మూలాన పెట్టేసారు మైత్రి మూవీ మేకర్స్ . ఆల్రెడీ తేరి సినిమా తెలుగులో డబ్ అయి రిలీజ్ అయ్యింది . తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి తమిళ్ లో పెద్ద హిట్ కాగా తెలుగులో మాత్రం అంతగా ఆడలేదు . పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ కానీ పనికిరాకుండా పోయింది . పాపం ఈ సినిమా పక్కన పడటంతో సంతోష్ శ్రీనివాస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది .