ప్లాప్ నుండి తప్పించుకున్న రవితేజ


Ravi Teja
Ravi Teja

మాస్ మహారాజ్ రవితేజ ప్లాప్ నుండి తప్పుకున్నాడు . ఇప్పటికే పలు ప్లాప్ లతో కెరీర్ పరంగా సతమతం అవుతున్నాడు రవితేజ సరిగ్గా ఇలాంటి సమయంలోనే రణరంగం అనే గ్యాంగ్ స్టర్ కథ చెప్పాడట సుధీర్ వర్మ . రవితేజ కు ఈ సినిమా కథ నచ్చింది అయితే ఎక్కడో తేడా కొట్టినట్లుంది అందుకే సైలెంట్ అయిపోయాడు ఈలోపు శర్వానంద్ కు ఈ రణరంగం కథ గురించి తెలియడంతో వెంటనే చేయాలనీ డిసైడ్ అయ్యాడట !

ఇంకేముంది శర్వా ఆ సినిమా చేయడానికి సిద్ధం కావడంతో సైలెంట్ గా తప్పుకున్నాడట ! దాంతో శర్వా చేసాడు కట్ చేస్తే రణరంగం సినిమా విడుదల అయ్యింది ప్లాప్ దిశగా దూసుకుపోతోంది . అంటే రవితేజ మరో ప్లాప్ నుండి తప్పించుకున్నాడట మాట . అసలే నేల టికెట్ , టచ్ చేసి చూడు వంటి డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్న రవితేజ రణరంగం ప్లాప్ నుండి తృటిలో తప్పించుకున్నాడు . లేదంటే పెద్ద ప్లాప్ మీద పడేది పాపం . ప్రస్తతం డిస్కో రాజా చిత్రం చేస్తున్నాడు మరి ఇది ఏమౌతుందో !