రెమ్యునరేషన్ తగ్గించిన హీరో


Raviteja descreasing his remunaration for Disco Raja

నేల టిక్కెట్టు , టచ్ చేసి చూడు , అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా మూడు చిత్రాలు వరుసగా డిజాస్టర్ లు అయ్యాయి దాంతో రవితేజ తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నాడు . పై మూడు చిత్రాలు కూడా 6 కోట్ల నుండి 10 కోట్ల షేర్ రాబట్టలేక పోయాయి . ఇక అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం అయితే మరీ దారుణం 6 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది . మేకింగ్ 30 కోట్ల వరకు అవుతోంది కానీ రిటర్న్స్ మాత్రం పది కోట్లు దాటడం లేదు అందుకే తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట రవితేజ .

తాజాగా రవితేజ డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు . రామ్ తాళ్ళూరి అనే యువ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . పాపం ఈ నిర్మాతే నెల టికెట్టు అనే చిత్రాన్ని నిర్మించి ఘోరంగా నష్టపోయాడు . అందుకే ఈ నిర్మాతకు కేవలం 6 కోట్ల రెమ్యునరేషన్ కి మాత్రమే సినిమా చేస్తున్నాడట రవితేజ . ఇది హిట్ అయితే పెంచొచ్చు లేదంటే 5, 6 కోట్ల హీరోగా మారనున్నాడు రవితేజ .

English Title: Raviteja descreasing his remunaration for Disco Raja