రవితేజ నెక్స్ట్ సినిమాపై అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారుగా


రవితేజ నెక్స్ట్ సినిమాపై అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారుగా
రవితేజ నెక్స్ట్ సినిమాపై అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారుగా

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం చేస్తున్న డిస్కో రాజా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు చిత్రాలు విడుదలై మంచి విజయాలు సాధించిన విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాలు రోటీన్ కి భిన్నంగా ఏం సాగవు, కాకపోతే ఎంటర్టైనింగ్ గా ఉండడంతో జనాలు ఆమోద ముద్ర వేశారు. ఈసారి కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ఇలాంటి సినిమానే వస్తుందని ఆశించారు. పైగా ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ తేరికి రీమేక్ గా తెరకెక్కనుందని సమాచారం. సగం ఈ వార్తకు మాస్ మహారాజా అభిమానుల్లో నీరసం వచ్చేసింది. ఎందుకంటే తేరి ఒక సాధారణ రివెంజ్ స్టోరీ. కేవలం హీరోయిజం మీద ఆధారపడి తీసిన మూవీ. విజయ్ అభిమానులకు ఈ చిత్రం బాగా ఎక్కింది. పైగా ఈ సినిమా పోలీసోడుగా తెలుగులో అనువాదమైపోయింది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటికే టివి ప్రీమియర్స్ కూడా జరిగిపోయాయి. మరి ఇలాంటి కథను, ఇంత పాతబడిపోయిన కథను ఇప్పుడు రవితేజ్, గోపీచంద్ మలినేని జంట మళ్ళీ అన్ని కోట్లు పోసి ఎందుకు చెబుతున్నారా అంటూ అనుమానాలు మొదలయ్యాయి.

గోపీచంద్ మలినేని కెరీర్ లో చేసిన 5 చిత్రాల్లో కేవలం రెండే హిట్లు. ఆ రెండు హిట్లు కూడా రవితేజతో చేసినవే. నిజానికి ఇవి కూడా కొంచెం రొటీన్ కథతో తెరకెక్కినవే. కానీ మాస్ మహారాజా తన మ్యానరిజమ్స్ తో సినిమాను గట్టికించాడు. కొంత ఎంటర్టైనింగ్ వే లో ఉండడంతో ఈ రెండు చిత్రాలు హిట్ అయిపోయాయి. మిగిలిన మూడు సినిమాల విషయంలో ఆ పప్పులు ఉడకలేదు. ముఖ్యంగా రామ్ తో తెరకెక్కించిన పండగ చేస్కో అయితే విమర్శల్ని మూట గట్టుకుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని రవితేజ – గోపీచంద్ మలినేని చిత్రంపై త్వరగానే అంచనాలను తగ్గించేసుకున్నారు.

అయితే దర్శకుడు గోపీచంద్ ఇటీవలే ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఈ చిత్రం తేరి రీమేక్ గా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పుకొచ్చాడు. ఇది కూడా పోలీస్ కథ అయినా నిజ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా వివరించాడు. ప్రస్తుత ట్రెండ్ ఇదే కదా. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం కావడంతో ఇప్పుడు అందరిలో మళ్ళీ ఆసక్తి నెలకొంది. మాస్ మహారాజా నుండి ఈసారి ప్రామిసింగ్ ఔట్పుట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. గోపీచంద్ మలినేని ఈసారి స్క్రిప్ట్ విషయంలో బాగా వర్కౌట్ చేసినట్లు అర్ధమైపోతోంది. శృతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. బలుపు చిత్రానికి రవితేజ, గోపీచంద్ మలినేని, శృతి హాసన్ పనిచేసిన విషయం తెల్సిందే. మళ్ళీ ఈ ముగ్గురూ కలిసి ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. ఇప్పటికే థమన్ సంగీత దర్శకుడు అని ప్రకటించేసారు. దీంతో పాటు తమిళ సినిమాల్లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.