బలుపు కాంబో.. రీమేక్ కాదట!


బలుపు కాంబో.. రీమేక్ కాదట!
బలుపు కాంబో.. రీమేక్ కాదట!

డాన్ శీను సినిమాతో మాస్ రాజా రవితేజను సరికొత్త యాంగిల్ చూపించిన దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆ తరువాత బలుపు అనే మరో సినిమాతో మరో విధంగా సక్సెస్ కొట్టిన ఈ దర్శకడు ఇప్పుడు హ్యాట్రిక్ కి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. . రవితేజ 66వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్న గోపి రీమేక్ కథను సెలెక్ట్ చేసుకున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి.

కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన విజయ్ తేరి సినిమాకు ఇది రీమేక్ అని టాక్ వచ్చింది. అయితే ఆ కథనాలపై దర్శకుడు తొందరగానే క్లారిటీ ఇచ్చాడు. మా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా ఏ కథకు రీమేక్ కాదని చెబుతూ.. కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్న సినిమా అని వివరణ ఇచ్చాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినకొన్ని సంఘటనలను సినిమాలో హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక రవితేజ సరసన శృతి హాసన్ కథానాయికగ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. విఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆ సైన్స్ ఫిక్చన్ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.