మాస్ రాజా భారీగా పెంచేశాడు?

మాస్ రాజా భారీగా పెంచేశాడు?
మాస్ రాజా భారీగా పెంచేశాడు?

ఒక్క హిట్టు ప‌డితే పారితోషికాలు పెంచేయ‌డం కామ‌నే. మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఇందుకు మిన‌హాయింపేమీ కాదు. గ‌త కొంత కాలంగా సాలీడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ర‌వితేజ‌కు `క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌భించింది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ రోజు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా ఫ‌స్ట్ షోతో మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

ఆ త‌రువాత సంక్రాంతికి విడుద‌లైన చిత్రాల్లో విన్న‌ర్‌గా నిలిచి ఫ‌స్ట్ ప్లేస్‌ని కొట్టేసింది. ఇప్ప‌టికీ ఈ మూవీ క‌లెక్ష‌న్స్ స్ట‌డీగా వున్నాయి. దీంతో మాస్ రాజా ర‌వితేజ త‌న పారితోషికాన్ని 12 నుంచి 14 కోట్ల‌కు పెంచిన‌ట్టు తెలుస్తోంది. అదీ వితౌట్ జీఎస్టీ మాత్ర‌మే జీఎస్టీతో క‌లిపి 16 కోట్ల‌వుతోంద‌ట‌. `క్రాక్‌` చిత్రం థియేట్రిక‌ల్ రిలీజ్‌కి ముందే 20 నుంచి 26 కోట్ల‌కు బిజినెస్ జ‌రిగింది.

దీంతో త‌న పారితోషికాన్ని ర‌వితేజ భారీగా పెంచేశార‌ట‌. గ‌త కొంత కాలంగా హిట్‌లు లేక‌పోవ‌డంతో 10 నుంచి 12 కోట్లు మాత్ర‌మే తీసుకున్న ర‌వితేజ తాజాగా `క్రాక్` హిట్‌తో త‌న పారితోషికాన్ని ఏకండా జీఎస్టీతో క‌లిపి 16 కోట్ల‌కు పెంచిన‌ట్టు తెలిసింది. ఇది నిర్మాత‌ల‌కు భార‌మే అయినా ర‌వితేజ ట్రాక్ రికార్డుకిది త‌క్కువే అంటున్నారు.