ర‌వితేజ 68 రెమ్యున‌రేష‌న్ అంతా?

Raviteja hikes his remunaration
Raviteja hikes his remunaration

కొంత విరామం త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన హైవోల్టేజ్యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఠాగూర్ మ‌ధు నిర్మించిన ఈ చిత్రం ర‌వితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా రికార్డు సృష్టించింది.

ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో మాస్‌రాజా ర‌వితేజ త‌న పారితోషికాన్ని భారీగా పెంచేశారు. ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌‌త్వంలో రూపొందుతున్న `ఖిలాడీ` చిత్రంలో న‌టిస్తున్న ర‌వితేజ తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో త‌న 68వ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన విష‌యం తెలిసిందే. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

బెజ‌వాడ ప్రస‌న్న‌స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ మూవీ కోసం ర‌వితేజ ఏకంగా 16 కోట్లు డిమాండ్ చేశార‌ట‌. నిర్మాత టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ అంత మొత్తం ఇవ్వ‌డానికి అంగీక‌రించ‌డంతో ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియ‌ల్‌గా ఈ ఆదివారం ప్ర‌క‌టించారు. `ఖిలాడీ` పూర్త‌వ్వ‌గానే త్రినాథ‌రావు న‌క్కిన ఫిల్మ్ సెట్స్‌పైకి రానుంద‌ని తెలిసింది.