రవితేజ ఖిలాడీ స్ట్రీమింగ్ రైట్స్ పై తాజా అప్డేట్

రవితేజ ఖిలాడీ స్ట్రీమింగ్ రైట్స్ పై తాజా అప్డేట్
రవితేజ ఖిలాడీ స్ట్రీమింగ్ రైట్స్ పై తాజా అప్డేట్

మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ఖిలాడీ. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా ఖిలాడీ రిలీజ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులపై తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను థియేటర్లోనే మొదట విడుదల చేస్తారు కానీ ఓటిటి డీల్ మాత్రం క్లోజ్ అయిందట. అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ అమౌంట్ ఆఫర్ చేసి ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రవితేజ గత చిత్రం క్రాక్ ఆహాలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఖిలాడీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. రమేష్ వర్మ ఖిలాడీ సినిమాను తెరకెక్కిస్తుండగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఖిలాడీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.