మాస్ రాజా `ఖిలాడీ` టీజ‌ర్‌కు డేట్ ఫిక్స్‌!

మాస్ రాజా `ఖిలాడీ` టీజ‌ర్‌కు డేట్ ఫిక్స్‌!
మాస్ రాజా `ఖిలాడీ` టీజ‌ర్‌కు డేట్ ఫిక్స్‌!

మాస్ మ‌మారాజా ర‌వితేజ `క్రాక్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన విష‌యం తెలిసిందే. ఈమూవీ త‌రువాత రెట్టించిన ఉత్సాహంతో `ఖాలాడీ` చిత్రాన్ని చేస్తున్నారు. హై వొల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత‌, పెన్ స్టూడియో అధినేత జ‌యంతిలాల్ గ‌డ‌తో క‌లిసి కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే ఇట‌లీలో ఛేజింగ్ స‌న్నివేశాల‌తో పాటు కీల‌క పోరాట ఘ‌ట్టాల్ని కూడా చిత్ర బృందం పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వ‌చ్చింది. ముందు అనుకున్న బ‌డ్జెట్‌కి మించి ఈ షెడ్యూల్ కోసం ఖ‌ర్చు చేశారు. మ‌రోసారి ఇట‌లీ వెళ్లాల్సి వుంది. అయితే ఇక్క‌డే ఆ దృశ్యాల‌ని ఫినిష్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.

దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ని ఈ నెల 12న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ప్ర‌క‌టిస్తూ ఓ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రం ర‌వితేజకు 67వ చిత్రం.