`క్రాక్` మార్నింగ్ షోస్ క్యాన్సిల్‌!


`క్రాక్` మార్నింగ్ షోస్ క్యాన్సిల్‌!
`క్రాక్` మార్నింగ్ షోస్ క్యాన్సిల్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోనీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `బ‌లుపు` త‌రువాత ర‌వితేజ‌తో క‌లిసి శృతిహాస‌న్ న‌టించింది. హ్యాట్రిక్ హిట్ కోసం హీరో ర‌వితేజ ద‌ర్శ‌కుడు గోపీచంద్‌ క‌సితో చేసిన మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ ఈ శ‌నివారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతోంది.

స‌ర‌స్వ‌తి ఫిలింమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. భారీ రేంజ్‌లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయిన‌ట్టు తెలిసింది. ప్రీవియ‌న్ చిత్రాల‌ని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రీబ్యూట‌ర్స్ ఈ మూవీ రిలీజ్‌కి క్ల‌య‌రెన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఉద‌యం 8:45, 9:00 గంట‌ల‌కు ప‌డాల్సిన మార్నింగ్ షో ప‌డ‌లేదు.

దీంతో తెలంగాణ‌లో `క్రాక్` ఎర్లీ మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో నిర్మాత బి. మ‌ధు డిస్ట్రీబ్యూట‌ర్ ల‌కు సంబంధించిన క్లియ‌రెన్స్‌ని పూర్తి చేసి `క్రాక్‌`ని య‌దావిధిగా రిలీజ్ చేస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో `క్రాక్‌` రిలీజ్ కొంత ఆల‌స్యం అయిన‌ట్టు తెలిసింది.