నేల టిక్కెట్టు టీజర్ గొప్పగా ఏమి లేదు


మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ” నేల టిక్కెట్టు ”. సోగ్గాడే చిన్నినాయనా వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . సోగ్గాడే చిన్నినాయనా తర్వాత అన్నపూర్ణ కాంపౌండ్ లోనే రారండోయ్ వేడుక చూద్దాం చిత్రానికి దర్శకత్వం వహించాడు అయితే ఆ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు . దాంతో కళ్యాణ్ కృష్ణ కు గ్యాప్ వచ్చింది .

మొత్తానికి కిందా మీదా పడి రవితేజ కు కథ వినిపించి మెప్పించాడు . సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది కూడా ఇక విడుదలకు సిద్ధం అవుతుండగా ఈరోజు టీజర్ ని విడుదల చేసారు . నేల టిక్కెట్టు టీజర్ విడుదల అయ్యింది కానీ అంత గొప్పగా ఏమి లేదు . సాదా సీదా గా ఉంది నేల టిక్కెట్టు . టీజర్ ఇలా ఉంటే సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందా ? చూడాలి . అసలే టచ్ చేసి చూడు చిత్రం ప్లాప్ అయి కూర్చుంది ఈ సమయంలో రవితేజ కు తప్పనిసరి హిట్ కావాల్సిందే .