నేల టిక్కెట్టు ,అమ్మమ్మ గారిల్లు లలో ఏది హిట్టు


raviteja nela ticket v/s nagashourya ammamma garilluఈరోజు రవితేజ నటించిన ” నేల టిక్కెట్టు ” నాగశౌర్య నటించిన ” అమ్మమ్మగారిల్లు ” చిత్రాలు విడుదల అవుతున్నాయి . ఈ రెండు చిత్రాలలో రవితేజ నటించిన నేల టిక్కెట్టు చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మరి అమ్మమ్మ గారిల్లు ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే . సోగ్గాడే చిన్నినాయనా వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్టు కు దర్శకత్వం వహిస్తున్నాడు . రవితేజ సరసన మాళవిక శర్మ నటిస్తోంది .

రవితేజ నేల టిక్కెట్టు పై ఆశలు పెంచుకున్నాడు , రవితేజ గత చిత్రం టచ్ చేసి చూడు ప్లాప్ కావడంతో ఈ సినిమా హిట్ కోసం ఆశిస్తున్నాడు . ఇక నాగశౌర్య నటించిన అమ్మమ గారిల్లు విషయానికి వస్తే ……. ఛలో తర్వాత వస్తున్న చిత్రం కానీ ఎందుకో నాగశౌర్య మాత్రం ఈ సినిమా పట్ల అంతగా ఆసక్తితో లేడు . కాకపోతే కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి అన్న ఆసక్తి నెలకొంది . మొత్తానికి ఈరోజు విడుదల అవుతున్న నేల టిక్కెట్టు , అమ్మమ్మ గారిల్లు లలో ఏది కొడుతుందో హిట్ .