సక్సెస్ కోసం కలుస్తున్న హీరో డైరెక్టర్ లు

Raviteja next film with VV Vinayak మాస్ మహారాజ్ రవితేజ కు గతకొంత కాలంగా సక్సెస్ లేదు , అలాగే మాస్ దర్శకులు వివివినాయక్ కు కూడా చాలా కాలంగా సక్సెస్ లేదు పైగా ఈ ఇద్దరూ చేసిన చిత్రాలు ఘోర పరాజయాలు అందుకున్నాయి దాంతో సక్సెస్ కోసం ఈ ఇద్దరు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు . గతంలో వినాయక్ – రవితేజ ల కాంబినేషన్ లో కృష్ణ అనే సినిమా వచ్చింది . అది సూపర్ హిట్ అయ్యింది అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే .

 

రవితేజ నటించిన చిత్రాలు కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోతున్నాయి అలాగే వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రాలు కూడా డిజాస్టర్ లు అయ్యాయి . బాలయ్య తో సినిమా అనుకున్నాడు కానీ కథ కుదరలేదు దాంతో రవితేజ వెంటపడ్డాడు కథ సెట్ అయ్యిందట . మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా హిట్ అవుతుందో ? మళ్ళీ ఇద్దరూ గట్టెక్కుతారో చూడాలి .

 

English Title: Raviteja next film with VV Vinayak